కొన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ

తెలంగాణ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీని చేపట్టింది. ముఖ్యమంత్రి తిరుపతి నుండి వచ్చిన తరువాత నామినేటేడ్ పోస్టుల భర్తీ జరుగుతందని వచ్చిన వార్తలను నిజం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.పలు కార్పోరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.  కల్లు  గీత కార్పొరేషన్ చైర్మెన్ గా తెలంగాణ జర్నలిస్టు లేత పల్లె రవి నియమించారు.
* నెడ్‌క్యాప్‌ ఛైర్మన్‌- సయ్యద్‌ అబ్దుల్‌ అలీమ్‌
* సెట్విన్‌ ఛైర్మన్‌- మిర్‌ ఇనాయత్‌ అలీ భాక్రి
* రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌- బుడాన్‌ బేగ్‌
* విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌- కోటేశ్వరరావు
* ఖాదీ గ్రామీణాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌- యూసఫ్‌ జాహిద్‌
* పట్టణ, ఆర్థిక, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌- విప్లవ్‌కుమార్‌
* గిరిజన సహకార ఆర్థిక సంస్థ ఛైర్మన్‌- తాటి వెంకటేశ్వర్లు
* మైనార్టీ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌- అక్బర్‌ హుస్సేన్‌
* హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌- సంపత్‌కుమార్‌ గుప్తా
* విద్య, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌- నాగేందర్‌గౌడ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *