వాసవీ కాలేజీ మోసం పరీక్షలు రాయలేని విద్యార్థులు

వనస్థలిపురంలోని వాసవి జూనియర్ కళాశాల నిర్వకం వల్ల దాదాపు 300 మంది విద్యార్థులు పరీక్షలకు దూరం అయ్యారు. వాసవీ కాలేజీ యాజమాన్యం విద్యార్థులను నిట్టనిలువునా ముంచింది. దీనితో విద్యార్థులు వారి తల్లిదండ్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సరైన అనుమతి లేకుండా కాలేజీని ప్రారంభించిన వాసవీ కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డుకు చెల్లించాల్సిన ఫీజును చెల్లించలేదు. దీనితో ఈ కళశాలలో చదివిన వారికి ఎవరికీ హాల్ టికెట్లు రాలేదు. దీనితో విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చినా ఇవాళా రేపు అంటూ తిప్పించుకుని పరీక్షలకు ఒక రోజు ముందు చేతులెత్తేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనలతో కాలేజీ ఎదుట తీవ్ర ఉధ్రిక్తత నెలకొంది.
వాసవీ కళాశాల నిర్వాకంపై అటు ఇంటర్మీడియ్ బోర్డుతో పాటుగా ఇటు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పందించారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలకు వారిని అనుమతించడం కుదరని అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మేలో జరిగే అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అనుమతిస్తామని చెప్పారు. విద్యార్థులను మోసం చేసిన వాసవీ కాలాజే యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెడుతున్నట్టు కడియం శ్రీహరి వెల్లడించారు. విద్యార్థులను ఆదుకోవడం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేలో జరిగే పరీక్షలకు అనుమతించడం ద్వారా వారు విద్యా సంవత్సరం నష్టపోకుండా చూస్తామని చెప్పారు. వాసవీ కాలేజీ అటు బోర్డును ఇటు విద్యార్థులను మోసం చేసిందన్నారు. ఏదైనా కాలేజీలో చేరే ముందు కాళాశాలకు గుర్తింపు ఉందా లేదా అన్న విషయాన్ని గమనించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *