గ్యాస్ సిలిందర్ ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో సిలిండర్ ధర 90 రూపాయలు పెరిగింది. రాయితీ సిలిండర్లతో పాటుగా రాయితీ లేని సిలిండర్ ధరలు కూడా భారీగానే పెరిగాయి. వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్ ధరను దాదాపు 150 రూపాయలు పెంచుతున్నట్టుపెట్రోలియం సంస్థలు ప్రకటించాయి. గృహ వినియోగ దారుపైకూడా 90 రూపాయలు మేరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 738 రూపాయలు ఉండగా ఇప్పుడది 828 రూపాయలకు పెరిగింది. ఈ పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని పెట్రోలియం సంస్థలు వెల్లడించాయి. దీనితో పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి రానున్నాయి.