మా అధ్యక్షుడిగా శివాజీ రాజా

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా క్యారెక్టర్ నటుడు శివాజీ రాజా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడి రాజేంద్రప్రసాద్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో శివాజీ రాజా మా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపడతారు. శివాజీ రాజాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు రాజేంద్ర ప్రసాద్ వెళ్లడించారు. మా ప్రధాన కార్యదర్శిగా నరేష్ ను ఎన్నుకున్నారు. మా అధ్యక్షుడిగా ఎన్నికలైన శివాజీ రాజాను పలువురు సినీ ప్రముఖులు అభినందించారు. క్యారెక్టర్ నటుడిగా సినీ రంగంలో తనదైన ముద్రను వేసుకున్న శివాజీరాజా దాదాపుగా 250 చిత్రాలకు పైగా నటించారు. మా కార్యకలాపాల్లో శివాజీ రాజా చురుగ్గా వ్యవహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *