కే.ఏ.పాల్ ప్రాచారంతోనే ట్రంప్ గెలిచాడా…!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం ప్రచారం చేసి గెలిపించింది ఎవరో కాదు మన కే.ఏ.పాల్ గారెనట ఆయనే ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. క్రైస్తవ మత ప్రచారకుడిగా తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన పాల్ గతంలో రాజకీయ రంగ  ప్రవేశం కూడా చేశారు. తన గొప్పతనం తెలుగు వారికి తెలియదని ప్రపంచ వ్యాప్తంగా తనకు భక్తులు అనుచర గణం ఉందంటూ ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా పాల్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. తాను గెలిపించిన నువ్వు భారతీయులపై జరుగుతున్న దాడులను అడ్డుకోవడం లేదంటూ ట్రంప్ పై ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ కు సలహా కూడా ఇచ్చారు. లోకేశ్ కు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై పాల్ స్పందిస్తూ లోకేశ్ ఎమ్మెల్సీ కాకుండా ఎమ్మెల్యేగా గెలవాలని అన్నారు. అందుకోసం అవసరం అయితే తాను లోకేశ్ కు మద్దతుగా ప్రచారం చేస్తానని ట్రంప్ ను గెలిపించినట్టుగా లోకేశ్ ను గెలిపిస్తానని అన్నట్టు సమాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *