సోషల్ మీడియాలో "గుర్మెహర్‌కౌర్‌" యుద్ధం

552068-gurmehar-kaur gur
ఢిల్లీకి చెందిన విద్యార్థిని  గుర్మెహర్‌కౌర్‌ పై సామాజిక మాధ్యమాల్లో యుధ్దం మొదలైంది. తాను ఏబీవీపీకి భయపడేది లేదు, దేశ ప్రజలందరి మద్దతు తనకు ఉందని అంటూ ఆమె ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు వైరల్ గా మారి  గుర్మెహర్‌కౌర్‌ వార్తల్లోకి ఎక్కింది. దీనికి తోడు తాను పెట్టిన పోస్టును చూసిన కొందరు తనను రేప్ చేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపధ్యంలో  గుర్మెహర్‌కౌర్‌ కు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అయితే అదే సమయంలో ఆమెపై విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. అమె గతంలో చేసిన పోస్టులను కోట్ చేస్తూ ఇప్పుడు ఆమెపై సామాజిక మాధ్యమాల్లో యుద్ధానికి దిగుతున్నారు. కేంద్ర  మంత్రి జిజుతో పాటుగా కొంత మంది మేధావులు, వీరేంద్ర సెహ్వాగ్, యోగీశ్వర్ దత్ లాంటి క్రీడాకారులు  గుర్మెహర్‌కౌర్‌ తీరును తప్పుబడుతున్నారు. ఇతర విషయాలను వదిలిపెట్టి చదవుపై దృష్టిపెడితే మంచిదంటూ కేంద్ర మంత్రి జిజు హితవు పలికారు. కార్గిల్ యుద్ధ వీరుడు అయిన కౌర్ తన తండ్రి ఆత్మ క్షోభపడేలాగా వ్యవహరిస్తోందంటూ జిజు విమర్శించారు. ఆ యువతి మెదడును కలుషితం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
గుర్మెహర్‌కౌర్‌ గతంలో చేసిన పోస్టుకు సేహ్వాగ్, యోగీశ్వర్ దత్ లు స్పందించారు.  తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదు… యుద్ధం చంపింది అనే అర్థంలో ప్లకార్డును పట్టుకున్న కౌర్ తన ఫొటోను ఫెస్ బుక్ లో అప్ లోడ్ చేసింది. దీనిపై వారు స్పందిస్తూ సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ నేను చేయలేదు నా బ్యాట్ చేసింది అంటూ వ్యంగంగా ట్విట్ చేయగా యోగీశ్వర్ దత్ యూదులను హిట్లర్ చంపలేదు గ్యాస్ చంపిది, కృష్ణ జింకను సల్మాన్ చంపలేదు బులెట్ చంపింది, ప్రజలను లాడెన్ చంపలేదు బాంబులు చంపాయి అని అర్థం వచ్చేలా ఫొటోలను పెడుతూ ట్విట్ చేశారు. మొత్తం మీద ఇప్పుడు  గుర్మెహర్‌కౌర్‌ హాట్ టాపిక్ అయింది. అమెకు మద్దతు ఇస్తున్న వారు ఒక వైపు వ్యతిరేకిస్తున్నవారు మరో వైపు సామాజిక మాధ్యమాల్లో యుద్ధం చేసుకుంటున్నారు. కౌర్ కు పలువురు వామపక్ష మేధావులు మద్దతు పలికారు. ఆమె అభిప్రాయాలను గౌరవించాలని ఇటువంటి ప్రకటనల ద్వారా ఆమె ను ఇబ్బందులు పెట్టవద్దని సూచించారు.
తాను పెట్టిన ఫేస్ బుక్ పోస్టులు వివాదాస్పదం కావడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీయడంతో  గుర్మెహర్‌కౌర్‌ తనను వంటిరిగా విదిలేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో విద్యార్థులు నిర్వహిస్తున్న ర్యాలీకి తాను హాజరు కావడం లేదని ఆమె చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *