హెచ్ఎండీఏ పరిధిలో ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎల్ఆర్ఎస్ దరఖాస్తు దారులు డిమాండ్ చేస్తున్నారు. రెగ్యులరైజేషన్ కోసం ఇళ్ల, దరఖాస్తు చేసుకుని ఇంత కాలమైన వారి సమస్యలను పరిష్కరించడం లేదని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఆలస్యం చేయడం వల్ల తమపై ఒత్తిడి పెరుగుతోందని వారు వాపోతున్నారు. కొంత మంది హెచ్ఎండీఏ అధికారులు ఈ దరఖాస్తులను అడ్డంపెట్టుకుని తమను అడ్డంగా దోచుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ హైదరాబాద్ జిందాబాద్ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. హెచ్ఎండీఏ లో కొంత మంది అధికారులు తమని వేధిస్తున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం తాము రుసుములు చెల్లించినప్పటికీ ఒక పథకం ప్రకారం అధికారులు ఆలస్యం చేస్తూ తమని వేధింపులకు గురిచేస్తున్నారని, ఇదే మని అడిగితే డబ్బులు డిమాండ్ చేస్తూ వేధిస్తున్నారని వారు ఆరోపించారు.
ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ దరఖాస్తు దారుల నుండి వసూలు చేస్తున్న నాలా ఫీజును కూడా మినహాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నాలా ఫీజు పేరుతో తమపై అధిక భారం మోపుతున్నారని వారు అంటున్నారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లేకుండా ఉధ్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.