కోర్టుకు శ్రీనివాస్ హత్య కేసు నిందితుడు

అమెరికాలో తెలుగు యువకులపై కాల్పులకు దిగి ఒకరిని హత్యచేసిన అమెరికన్ ఆడమ్ ప్యూరింటన్ ను కోర్టులో హాజరు పర్చారు. జాతి వివక్ష తలకెక్కి తెలుగు యువకులను ” మా దేశం విడిచి వెళ్లండి” అంటూ కాల్పులు జరపగా అందులో కూచిబొట్ల శ్రీనివాసం మరణించారు. మరో యువకుడు అలోక్ గాయాలతో బైటపడగా వీరిని కాపాడ్డానికి వచ్చిన  మరో అమెరికన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అమెరికా నేవీ మాజీ అధికారి అయిన ప్టూరింటన్ పై ఫస్ట్‌ డిగ్రీ హత్య, ఫస్ట్‌ డిగ్రీ హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.ప్యూరింటన్‌ జాత్యహంకార నేరానికి పాల్పడినట్లు డిస్ట్రిక్ట్‌ కోర్టులో రుజువైతే అతడికి 50ఏళ్ల శిక్ష పడవచ్చు.  ఇదే నేరంపై ఫెడరల్ సంస్థ కూడా దర్యాప్తు చేస్తోంది.  ఎఫ్‌బీఐ ఏజెంట్స్‌ దీన్ని జాత్యహంకార నేరంగా రుజువు చేస్తే  అతనికి మరణశిక్ష  పడవచ్చు.  ప్రస్తుతం జాన్సన్‌ కౌంటీ జైలులో ఉన్న అతనిపై నమోదైన అభియోగాలు సంబంధించి కోర్టులో వాదనలు పూర్తయిన తరువాత శిక్షను ఖరారు చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *