తాను త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు బ్యాట్మింటన్ స్టార్ గుత్తా జ్వాల తెలిపారు. తనకు రాజకీయ రంగం పై ఆశక్తి ఉందని రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్టు ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే తాను ఏ పార్టీలో చేరాలనుకుంటున్నది జ్వాలా చెప్పలేదు కానీ ప్రజా సమస్యలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తున్న తీరు బాగుందని మెచ్చుకున్నారు. పవన్ పార్టీలో చేరాతార అనే ప్రశ్నకు మాత్రం స్పష్టంగా సమాధానం చెప్పలేదు. మేగా ప్యామిలీతో తనకు ఉన్న పరిచయాల దృష్ట్యా పవన్ పార్టీలోకి వెళ్తరని అనుకోవచ్చ అన్న ప్రశ్నకు స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కు మంచి విజన్ ఉందంటూ మెచ్చుకున్నారు. తాను రాజకీయాల్లో రావడం ఖచ్చితమే అయినా ఏ పార్టీ చేరతానో చెప్పలేనని అన్నారు. రాజకీయాల్లో తాను కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అయ్యేలాగా కాకుండా పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉంటానని చెప్పారు. రాజకీయాల్లో తాను తప్పుకుండా రాణిస్తానన్నారు. క్రీడా రంగంలో ఉన్నన్ని కుట్రలు సాధారణ రాజకీయాల్లో కూడా ఉండవని చెప్పారు.
దేశానికి పతకాలు తెచ్చిన తనను ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టారని అన్నారు. మన క్రీడా సంఘాలు సింగిల్స్ పోటీలకు ఇచ్చిన ప్రాధాన్యం డబుల్స్ కు ఇవ్వడంలేదని దీనిపై ప్రశ్నించినందుకే తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని జ్వాలా అన్నారు. గోపీచంద్ తో తనుకు వ్యక్తిగత అభిప్రాయబేధాలు ఏమీ లేవని గోపీచంద్ డబుల్స్ కు సరైన న్యాయం చేయడంలేదనే తాను ప్రశ్నించానని దీనిమీదే అతనిపై ఫిర్యాదు చేశానని చెప్పారు. గోపీచంద్ తో రాజీకి వచ్చే అవకాశం కానీ రాజీ పడాల్సిన అవసరంగానీ తనకు లేదన్నారు. అంతర్జాతీయ క్రీడాకారిణిగా తనకు దక్కాల్సిన గౌరవం దక్కడంలేదని జ్వాలా ఆవేదన వ్యక్తం చేశారు. తన దూకుడు వల్లే తాను నష్టపోయనని అనుకోవడం లేదని అది తన తీరని దానిని మార్చుకోవడాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతానికి సినిమాల్లో నటించడంలేదని చెప్పారు. తనకు మళ్లీ పెళ్లిచేసుకునే ఆలోచన ఉందని తనకు అన్ని విధాలుగా నచ్చిన వ్యక్తిని పెళ్లిచేసుకుంటానని చెప్పారు.