ప్రియాంక గౌన్ పై సెటైర్లు

ప్రతిష్టాత్మక ప్రీ-ఆస్కార్ పార్టీకి హాజరైన ప్రియాంక చోప్రా పై సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు పేలుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రియాంక వేసుకున్న గౌనుపై నెటిజన్లు  రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఆమె వేసుకున్న గౌను బాగా లేదని కాజు బర్ఫీలాగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలుపు,  గ్రే రంగుల్లో ఉన్న జియో మెట్రిక్ డిజైన్ గౌన్ వేసుకున్న ప్రియాంక ఈ ఫంక్షన్ లో కనిపించారు. అయితే గత సంవత్సరం ప్రియాంక గౌన అదిరిపోయిందని ఈ సంవత్సరం ఆమె వేసుకున్న గౌను తేలిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
పాన్ పరాగ్ ప్రకటనల్లో గతంలో నటించిన ప్రియాంక చోప్రా అప్పటి జ్ఞాపకాలను మర్చిపోలేకనే ఇటువంటి గౌన్ వేసుకున్నారంటూ కొంతమంది కామెంట్లు చేయాగా ఇంటి ఫ్లోరింగ్ కు వాడే మార్బుల్ డిజైన్ మాదిరిగా ప్రియాంక డ్రస్ ఉందని మరకొందరు వ్యాఖ్యానించార. మొత్తం మీద పాపం ప్రియాంక చోప్రా వేసుకున్న గౌన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆమె గౌను విపరీతంగా సెటైర్లు షికారలు చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *