అంగన్ వాడీ కేంద్రాల్లోని పసిపిల్లలకు కడుపునిండా తిండి పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ కేంద్రాల్లోని పిల్లలకు గతంలో మాదిరిగా గ్రాముల లెక్కన ఆహం పెట్టే విధానానికి స్వస్తి పలకాలని కేసీఆర్ అన్నారు. ప్రగడి భవన్ లో అంగన్ వాడీ కార్యకర్తలతో సమావేశమైన కేసీఆర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో పసిపిల్లలు ఆకలితో ఉండకుండా చూడాలన్నారు. పిల్లల ఆరోగ్య విషయంలో అంగన్ వాడీ కార్యకర్తలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొన్ని చోట్ల ప్రైవేటు వైద్యులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని కేసీఆర్ చెప్పారు. అవసరం లేకున్నా మహిళల గర్భసంచీలను తీసివేస్తూ వారి ఆరోగ్యాలతో ఆటలు ఆడుకుంటున్నారని అటువంటి వారి విషయంలో అంగన్ వాడీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వానికి సమాచారం అందచేయాలన్నారు. కాసులకోసం కక్కూర్తి పడి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటే వదిలేది లేదని హెచ్చరించారు.
అంగడ్ వాడీ కార్యకర్తలపై ముఖ్యమంత్రి వరాలు కురిపించారు. చాలా కాలంగా అంగన్ వాడీ కార్యకర్తలు చేస్తున్న డిమాండ్ లకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యకర్తలకు ఇక నుండి 10,500 రూపాయల జీతం ఇవ్వనున్నట్టు చెప్పారు. సహాయకుల జీతాన్ని కూడా 6వేలకు పెంచుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అర్హులైన వారికి ఇళ్లు కట్టిస్తి ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అంగన్ వాడీ కార్యకర్తల్లో విద్యార్హతలు ఉన్న వారికి సూపర్ వైజర్లుగా పదోన్నతి కల్పించే విషయం కూడా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం జీతాలు పెంచడంతో పాటుగా సంవత్సరం తరువాత మరోసారి కార్యకర్తల జీతాలను సమీక్షించి పెంచుతామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ప్రకటనతో అంగన్ వాడీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాను కోరుకుంటున్నట్టు జీతాలు పెంచడంతో పాటుగా ఇళ్ల నిర్మాణం కూడా చేపడతాని సీఎం హామీ ఇవ్వడం తమకు ఆనందంగా ఉందని వారుంటున్నారు.