బార్కాస్ లో పోలీసుల తనిఖీలు

0
48

హైదరాబాద్ పాతనగరంలోని బార్కాస్, చంద్రాయణగుట్టలలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 300 మంది పోలీసు బలగాలు బార్కాస్, చంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ రెండు ప్రాంతాల్లోకి దారితీసే రహదారులను మూసివేసిన పోలీసులు ఈ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇటీవల కాలంలో బార్కాస్ ప్రాంతంలో అసంఘాక కార్యకలాపాలు ఎక్కువ కావడంతో పోలీసులు ఈ చర్యకు దిగినట్టు తెలుస్తోంది. సున్నిత ప్రాంతాలు కావడంతో పోలీసులు భారీ సంఖ్యలో చేరుకుని తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 11 మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకోవడంతో పాటుగా 14 మంది అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఎటువంటి పత్రాలు లేని 60కి పైగా ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటుగా ఆటోలను కూడా పోలీసులు స్టేషన్ కు తరలించారు. గుర్రపు స్వారీలను నిర్వహిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న ఘటనలు కూడా జరగడంతో 3 గుర్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు కార్డన్ సెర్చ్ లో భాగంగా ఎమ్మెల్యే అక్భరుద్దీన్ ఓవైసీ పై హత్యాయత్నం కేసులో నిందితుడు మహ్మద్ పహిల్వాన్ ఇంట్లో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బార్కాస్ లో ఉన్న పహిల్వాన్ కు చెందిన నివాసంలో పోలీసులు విస్తృత్గంగా సోదాలు నిర్వహించారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here