ఎన్నాళ్లీ రైతుల వెతలు

అన్నదాత దేశానికి వెన్నుముక…రైతులను ఆదుకోవడం మా కర్తవ్యం… మాది రైతు ప్రభుత్వం… ప్రభుత్వాలు రాజకీయ నేతలు ఎవరెన్ని మాటలు చెప్పిన దేశానికి అన్నం పెట్టే రైతుల జీవితంలో వెలుగులు కరువయ్యాయి. ఒక సారి అతివృష్టి కాటేస్తే మరోసారి అనా వృష్టి ఇబ్బందులు పెడుతోంది. వీటికి తోడు పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్న చందగా తయారైన ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగ దారుడు కొనులాంటే ధరలు కొండన ఎక్కి కుర్చుంటున్నాయి. అటు రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఏవీ ఫలితాలను ఇవ్వడం లేదు. తెలంగాణ కంది రైతులు, అంధ్రా మిర్చీ రైతులు ఎవరైతేనేమి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న వారే. తమ ఉత్పత్తులకు తాము ధర నిర్ణయించుకోలేని అభ్యాగ్యులు మన రైతన్నలు. ఈ పరిస్థితుల్లో మార్పు రైతులను ఊరిస్తున్నదే తప్ప వారికి సరైన గిట్టుబాటు ధర మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదు.
వ్యవసయం దండగగా మారిందనే ఆవేదన రైతుల్లో వ్యక్తం అవుతోంది. ఉత్పత్తి వ్యయానికి 50 శాతం కలిపి కనీస మద్దతు ధరను నిర్ణయిచాలని రైతుల వెతలపై అధ్యాయనం చేసిన స్వామినాథన్ చేసిన సూచన ఇంకా అమలుకు నోచుకోలేదు. వ్యవసాయం లాభసాటి వ్యాపారం కావాలంటే ఈ సూచనలను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ సూచనలు అటకెక్కే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్వామినాథన్ సూచనపై నీతి ఆయోగ్ సభ్యుడు చేసిన వ్యాఖ్యలు మన ఏలికలకు ఈ సూచనలను అమలు చేయడంలో ఉన్న చిత్తశుద్దిని చూపిస్తోంది. పంటలు పండించడం ఒక ఎత్తయితే వాటిని నిల్వచేయడం మరో ఎత్తు. పండిన పంటను గిట్టుబాటు ధరలు వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం రైతులకు లేకపోవడం దారుణం. మన దేశంలో పండే పంటలో కేవలం రెండు శాతం మాత్రమే శుద్ది చేయగలుగుతున్నాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అధ్బుతమైన ప్రగతి సాధించామని జబ్బాలు చరుచుకున్నా ఆహార శుద్ధి విషయంలో మనం మరీ ఇంతగా వెనుకబడి ఉండడానికి కల కారణాల గురించి పెద్దగా వెతకాల్సిన అవసరం లేదు.
రైతుల సమస్యలు అనగానే రుణమాఫీలు చేయడం, ఉచిత కరెంటుతోనే బాధ్యత  తీరిపోయిందనుకుంటున్న ప్రభుత్వాలు  వ్యవసాయం లాభసాటి వ్యాపారంగా మార్చడానికి మాత్రం నడుబిగించడం లేదు. రైతన్నలు కన్నీళ్లను తుడిచే చర్యలు ఎక్కడా కనిపించడం లేదు.
 
ఉత్పత్తి వ్యయానికి 50శాతం అదనంగా కలిపి మద్దతు ధర నిర్ణయించాలన్న డాక్టర్‌ స్వామినాథన్‌ సూచనను ఇంకెంతోకాలం పక్కనపెట్టడం సమంజసం కాదు. ధరలు లాభసాటి అయినప్పుడే ఆయా పంటల సాగుకు రైతులు మొగ్గుచూపుతారని గుర్తించాలి. ఇటీవల నీతి ఆయోగ్‌ సభ్యుడొకరు స్వామినాథన్‌ సిఫార్సులు ప్రమాదకరమంటూ విడ్డూరమైన వ్యాఖ్య చేశారు. రైతు ఆదాయాలు రెట్టింపు కావాలంటే స్వామినాథన్‌ సిఫార్సులు అమలు చేయక తప్పదంటున్న తరుణంలో ఈ తరహా వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమే. మోదీ సర్కారు నిర్దేశితం లక్ష్యం అందుకోవాలంటే పైయెత్తున ఈ తరహా బాధ్యతారహిత ప్రకటనలకు అడ్డుకట్ట వేయడంతోపాటు గట్టి ముందుకు సాగాలి. కొన్ని రకాల పంట ఉత్పత్తులకు విలువ జోడింపుతో మంచి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఉత్పత్తిని అదే రూపంలో విక్రయించుకుంటే వచ్చే మొత్తం కంటే దానికి విలువ జోడింపుతో రెట్టింపు ఆదాయం సొంతం చేసుకోవచ్చు. దేశంలో తయారయ్యే మొత్తం ఆహార ధాన్యాల్లో కేవలం రెండు శాతం మాత్రమే శుద్ధి చేయగలగడం ఈ విషయంలో మన వెనకబాటునే సూచిస్తోంది. సాంకేతిక విజ్ఞానం పెద్దయెత్తున అందుబాటులోకి వచ్చిన తరుణంలో విలువ జోడింపుకోసం విస్తారంగా ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అప్పుడే రైతులకు లాభసాటి ధరలు అందుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *