భారత్ లో పాగాకు ఐఎస్ యత్నం

0
53
    ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద సంస్థల్లో ఒకటైన ఇస్లామిక్ స్టేట్  (ఐఎస్) వద్ద ఏడాదిన్నరపాటు బందీగా ఉన్న డాక్టర్ కోసనం రామ్మూర్తి ఎట్టకేలకు భారత్ కు చేరుకున్నారు. పశ్చిమ గోదావరికి చెందిన రామ్మూర్తి లిబియాలో పనిచేస్తున్నసమయంలో ఐఎస్ తీవ్రవాదులు అపరించుకుని పోయారు. దాదాపు 18 నెలల పాటు తమ వద్ద బంధీగా ఉంచుకున్న ఆయన్ను ఇటీవల విడుదల చేశారు. భారత్ కు చేరుకున్న రామ్మూర్తి మీడియాతో మాట్లాడుతూ తనను విడిపించడానికి భారత్ ప్రభుత్వం చాలా చొరవ తీసుకుందని అన్నారు. తన విడుదలకు సహకరించిన ప్రభుత్వానికి  కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశాన్ని ఆక్రమించాలనే ఆలోచన ఐఎస్ కు ఉందని, వారి సంభాషణల ద్వారా తనకు ఈ విషయం అర్థం అయిందని రామ్మూర్తి చెప్పారు. ఇరాక్, సిరియాలను ఆక్రమించినట్టుగానే భారత్ లోని కొన్ని ప్రాంతాలపైన పట్టుసాధించాలని వారు భావిస్తున్నట్టు తెలిపారు. భారత  దేశ అభివృద్దిని చూసి ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
    తాను బంధీగా ఉన్న సమయంలో తమ కోసం పనిచేయాలంటూ తనపై ఒత్తిడి తీసుకుని వచ్చారని డాక్టర్ రామ్మూర్తి చెప్పారు. తమ ఐఎస్ కార్యకలాపాలను విశ్వవ్యాప్తం చేయడం కోసం వారు పనిచేస్తున్నారని వారి విధానాలను ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలన్నదే వారి లక్ష్యమని అన్నారు. తనను వారు శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించారని చెప్పారు. తన ముందే అనేక మంది బంధీలను తీవ్రంగా కొట్టేవారని చెప్పుకొచ్చారు. వారి వద్ద ఉన్నన్నాళ్లూ నరకం అనుభవించానని అన్నారు. దారుణమైన వీడియోలు చూపించేవారని, తమ కార్యకలాపాలకు సంబంధించిన చిత్రాలతో వేధించేవారని వాపోయారు.
Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here