భారత్ ఘోర పరాజయం

0
58

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. భారీ విజయలక్ష్యంతో బరిలోకిదిగిన భారత్ 107 పరుగులకే ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో 105 పరుగులు చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో 333 పరుగులు భారీ తేడాతో భారత్ అపజయాన్ని మూటగట్టుకుంది. స్నిన్ కు సహకరిస్తున్న పిచ్ పై ఆసిసి స్పిన్నర్లు రెచ్చిపోయారు. ఆదేశపు ఆటగాడు ఓకాఫ్ అద్బుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఆరు వికెట్లు తీసుకుని భారత్ నడ్డివిరిచాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన కోహ్లీసేన మొదటి టెస్టు మ్యాచ్ లో ఘోరంగా విఫలమైంది. అటు మన బ్యాట్స్ మెన్ కానీ ఇటు బౌలర్లు కానీ రాణించలేకపోయారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here