కాశ్మీర్ పై నోరుజారిన కాంగ్రెస్

కాశ్మీర్ పై నోరుజారిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాలుక కరుచుకుంటోంది. కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడులు పెచ్చుమీరడం పై కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూ చేసిన వ్యాఖ్యలు తిరిగి వారి మెడకే చుట్టుకున్నాయి. ఇటీవల కాలంలో జమ్ము-కాశ్మీర్ లో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదుల పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. ఉగ్రమూలక దొంగ దెబ్బకు భారత జవాన్లు  ప్రణాలు కోల్పోతున్నారు. దీనిపై  అధికార పక్షాన్ని ఇరుకున్న పెట్టే ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ పార్టీ పాపం తానే చిక్కుల్లో పడింది. శాంతి భద్రతలను పరిరక్షించడంలో బీజేపీ విఫలం అయిందని చెప్తూ కాశ్మీర్ భారత్ చేయిదాటిపోతోందని, భద్రతా బలగాలు ఏం చేయలేకపోతున్నాయంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ కు ఊతం ఇచ్చేదిగా ఉందంటూ అధికార పక్షం ఒక్కసారిగా విరుచుకుని పడింది. భద్రతా బలగాల స్థైర్యాన్ని దెబ్బతీసేవిగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోందని బీజేపీ నేతలు విమర్శల వర్షం కురిపించారు. ఊహించని ఎదురుదాడికి పాపం కాంగ్రెస్ పార్టీ డీలా పడిపోయింది. తమ ఉద్దేశం బీజేపీ చేతకాని తనాన్ని ప్రజల ముందు ఉంచడం తప్ప భద్రతా దళాల సామర్థ్యం గురించికాదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
కాశ్మీర్ అంశంపై ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలనుకున్న కాంగ్రెస్ పార్టీ తానే ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రభుత్వాన్ని నిలదీయాలకుని తానే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.  సున్నితమైన అంశం పై మాట్లాడుతున్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చే ఇబ్బందులు కాంగ్రెస్ కు పూర్తిగా తెలిసి వచ్చాయి.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *