భారత్-ఆస్ట్రేలియాల మధ్య పూణేలో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ కు కష్టాలు తప్పేట్టులేవు. ఈ మ్యాచ్ లో భారత్ ఓటమి నుండి బయటపడడం టీమిండియాకు కష్టమే. భారత్ ముందు ఆస్ట్రేలియా 441 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. బౌలింగ్ కు సహకరిస్తున్న ఈ పిచ్ పై ఇంత భారీ స్కోరు చేయడం మన జట్టుకు దాదాపు ఆసాధ్యంగా కనిపిస్తోంది. ఇంకా రెండు రోజుల ఆట ఉండడం తో ఈ మ్యాచ్ లో ఓటమి నుండి గట్టెక్కడానికి బారత్ చెమటోడ్చక తప్పదు. 143 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి రెండో రోజు ఆటను ముగించిన ఆస్ట్రేలియా మూడో రోజు 285 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసిస్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ స్పిత్ అధ్బుతంగా ఆడి 109 పరుగులు చేశాడు. స్మిత్ వీరోచిత బ్యాటింగ్ తో పాటుగా ఆసిస్ కు అదృష్టం కూడా కలిసి వచ్చింది. ఆసిస్ ఆటగాళ్లు అపైరింగ్ నిర్ణయాల వల్ల బతికిపోయారు. భారత్ కు సమీక్షా అవకాశాలు అయిపోవడం వారికి కలిసి వచ్చింది. మొత్తం మీద భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన కంగారులు భారత్ పై తీవ్ర ఒత్తిడిని పెంచారు. ఈ మ్యాచ్ లో గట్టెక్కడానికి భారత్ బ్యాట్స్ మెన్ కష్టపడక తప్పదు.