ఈశా ఫౌండేషన్ కు ప్రధాని

సద్గురు జగ్గీవాసుదేవన్ కు చెందిన ఈశా కేంద్రాన్ని ప్రదాని నరేంద్ర మోడి సందర్శించారు. తమిళనాడు, కేరళ సరిహద్దులో కోయంబత్తూరుకు సమీపంలో ఉన్న ఈ కేంద్రానికి వచ్చిన ప్రధాని మోడీ భారీ శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటుగా అక్కడ జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యోగ శాస్త్రానికి సంబంధించిన ఆదియోగ పుస్తకాన్ని మోడీ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రధాన మంత్రితి ోపాటుగా తమిళనాడు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, పుదుచ్చేరీ గవర్నర్ కిరణ్ బేడీ, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటుగా పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. వచ్చే శివరాత్రి నాటికి 10కోట్ల మందికి యోగ శిక్షణను ఇవ్వాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు సద్గురు జగ్గి వాసుదేవన్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *