అమ్మకు అసలైన వారసురాలిని నేనే

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు నిజమైన వారుసురాలిని తానేనని జయలలిత మేనత్త దీపా జయకుమార అన్నారు. జయలలిత జయంతి సందర్భంగా మెరినా బీచ్ లోని ఆమె సమాధి వద్దకు వచ్చి అంజలి ఘటించిన జయకర్ మీడియాతో మాట్లాడారు. జయలలిత రాజకీయ వారసురాలిని తానేనని అన్నారు. జయలలిత ప్రాతనిధ్యం వహించిన ఆర్కేనగర్ అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికలో తాను పోటీ చేస్తానని దీప చెప్పారు. ప్రజలు తనను ఆదరిస్తారని తాను తప్పకుండా విజయం సాధిస్తానని దీప ధీమా వ్యక్తం చేశారు. తాను జయలలిత రాజకీయ వారసత్వాన్ని మాత్రమే కోరుకుంటున్నానని జయలలిత ఆస్తుల కోసం తాను పాకులాడడంలేదని అన్నారు. తనకు జయలలిత ఆస్తులు అవసరం లేదని ఆమె వాడిని పెన్ను కూడా తనకు వద్దని చెప్పారు. జయ నివాసం పోయేస్ గార్డెన్ తమకే వస్తుందంటూ దీప  సోదరుడు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ తమకు ఆస్తులు అవసరం లేదని అమ్మ ఆశీస్సులు ఉంటే చాలన్నారు.
గత సంవత్సరం జయలలితను కలుసుకుని శుభాకాంక్షలు చెప్పానని ఇప్పుడు ఆమె లేకపోవడం బాధగా ఉందని అన్నారు. జయలలిత ఆశీస్సులు తమకు ఉన్నాయని ఆమె తనతోనే ఉన్నట్టు భావిస్తానని చెప్పారు. పన్నీరు సెల్వంతో కలిసి పనిచేసే అవకాశం  లేదని దీప స్పష్టం చేశారు. తాను ఎవరితోనూ కలిసి పనిచేసేది లేదని తాను స్వతంత్రంగానే రాజకీయాల్లో నిలదొక్కుకుంటానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *