ఆ కార్పోరేటర్ ఆస్తి 690 కోట్లు

    దేశంలోనే అత్యధిక ధనవంతమైన కార్పోరేషన్ ముంబాయి కార్పోరేషన్ కాగా ముంబాయి కార్పోరేటర్లలోనే అత్యధిక ధనవంతుడిగా బీజేపీ కార్పోరేటర్ గా అవతరించాడు. దేశంలోని అందరు కార్పరేటర్లకన్నా ఇతనే ధనవంతుడిగా భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు సమర్పించిన అఫడవిట్ లో తన ఆస్తులను 690 కోట్లుగా ప్రకటించిన పరాగ్ షా సంచలనం రేపాడు. ముంబాయి కార్పోరేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మక 132 డివిజన్ నుండి పరాగ్ షా గెలుపొందాడు. ఎక్కువగా వ్యాపారులు నివాసం ఉండే ఈ ప్రాంతం నుండి బీజేపీ అభ్యర్థి పరాగ్ షా గెలిచి దేశంలోనే ధనవంతుడైన కార్పోరేటర్ గా రికార్డు సాధించాడు. మన్ కన్ స్టక్షన్స్, మన్ డెవలపర్స్ పేరుతో భారీ భవనాల నిర్మాణం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహించే పరాగ్ షా కు ముంబాయితో పాటుగా గుజరాత్ లోనూ వ్యాపారాలు ఉన్నాయి. భారీగా ఆస్తులు పోగేసుకున్న పరాగ్ షా ఎన్నికలకు ముందు సమర్పించిన అఫడవిట్ లో తనకు 690కోట్ల అస్తులు ఉన్నట్టు వెల్లడించి సంచలనం రేపాడు.
     ముంబై కార్పోరేషన్ ఎన్నికల్లో గెల్చిన పరాగ్ షా ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్తున్నారు. తాను దేశంలోనే అత్యధిక ధనవంతుడైన కార్పోరేటర్ గా పేరుగాంచిన సంగతి తనకు తెలియదని చెప్తున్నాడు. తనకు ఉన్న ఆస్తులన్నింటినీ అఫడవిట్ లో పేర్కొన్నట్టు చెప్పాడు. తాను పారదర్శకంగా వ్యాపారం నిర్వహిస్తానని ఇప్పుడు ఆదే పారదర్శకతతో రాజకీయాలు నెరుపుతానని అన్నారు. ఎన్నికల్లో తన చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ నేత చద్దాను కూడా కలుపునిపోయి ఈ ప్రాంత అభివృద్దికి పాటుపడతానన్నారు.