అమెరికాలోని కన్సాస్‌లో తెలుగు యువకులపై జరిగిన కాల్పుల్లో ఒకరు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జాత్యహంకారంతోనే తెల్లజాతి వ్యక్తి తెలుగు వారిపై కాల్పులకు పాల్పడ్డడానే వార్తలు కలకలం రేపుతున్నాయి. మాదేశం విడిచి పోండి అని అరుస్తూ తెల్ల వ్యక్తి తెలుగు వారిపై కాల్పులు జరిపాడు. స్థానిక ‘ఆస్టిన్ బార్ అండ్ గ్రిల్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. అక్కడ జరిగిన కాల్పుల్లో కూచిబొట్ల శ్రీనివాస్ మృతిచెందగా మాదసాని అలోక్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బార్ లో కేవలం జాత్యంహంకారం వల్లే తెలుగు యువకులపై తెల్లజాతీయుడు కాల్పులకు తెగడినట్టు తెలుస్తోంది.
కాల్పుల బాధితులిద్దరూ గార్మిన్ సంస్థలో పనిచేస్తున్నారు. సంస్థలోని ఏవియేషన్ సిస్టమ్ ఇంజనీరింగ్ విభాగంలో వీరు పనిచేస్తున్నారు. తమ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులపై కాల్పులు జరగ్గా అందులో ఒకరు మృతి చెందడంపై గార్మిన్ సంస్థ తీవ్ర ఆవేదదను వ్యక్తం చేసింది. మృతుని కుటుంబానికి అండగా ఉంటామని అతని మృతదేహం స్వదేశానికి తరలించడంలో పూర్తి సహకారం అందచేస్తామని గార్మిన్ ప్రకటించింది. మరో వైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అలోక్ చికిత్స కు సహకరిస్తామని కూడా గార్మిన్ ప్రకటించింది. బాధితులకు అండగా ఉంటామనంటూ ప్రకటించింది. అమెరికాలో జాత్యహంకార దాడులపై భారత్ లో ఆందోళన అధికం అవుతోంది.