మహా శివరాత్రిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శివలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తులు పోటేత్తారు. శ్రీశైలం, శ్రీకాళహస్తీ, ద్రాక్షారామం, కాలేశ్వరం, వేములవాడ, కీసర, వరంగల్ వేయి స్థంబాల దేవాలయం, కురవిలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీశైలంలో దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. శ్రీశైలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులతో దేవాలయం కిటకిటలాడుతోంది. మహా శివరాత్రి సందర్భంగా దేవాలయ్యాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు.
మహాశివరాత్రని పురస్కరించుకుని వేములవాడ రాజన్న ఆలయంలో నిర్వహించే జాతరకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు. లక్షలాది మందికి పైగా భక్తులు ఇప్పటికే వేములవాడకు చేరుకున్నారు. కన్నుల పండుగ్గా జరిగే వేములవాడ జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎటువంటి అసౌర్యం కలక్కుండా చర్యలు తీసుకుంటున్నారు.