నటి కిడ్నాప్ కేసులో నిందితుడి అరెస్ట్

 
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మయాళీ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సినిమా షూటింగ్ నుండి వస్తున్న మళయాళీ నటి భావనను దారిలో అడ్డగించి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన కేసులో ప్రధాన నిందితుగా ఉన్న పల్సర్ సునీల్ అలియాస్ సునీల్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సునీల్ ఎర్నాకులం కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన సమయంలో పోలీసులు అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నార. ఈ సందర్భంగా అక్కడ హై డ్రామా చోటు చేసుకుంది. తనకు న్యాయమూర్తి ఎదుట లొంగిపోయేందుకు అవకాశం ఇవ్వాలంటూ సునీల్ కుమార్ కోర్టులో చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను తప్పించుకుని న్యాయమూర్తి క్యాబిన్ వైపు వెళ్లేందుకు సునీల్ కుమార్ తో పాటుగా అతని సహాయకుడు ప్రయత్నించాడు అయితే పోలీసులు వీరి చర్యలను అడ్డుకుని అరెస్టు చేసి తమతో తీసుకుని పోయారు. సునీల్ కుమార్ న్యాయ స్థానంలో లొంగిపోయేందుకు వస్తున్నారన్న సమాచారంతో ముందుగానే పోలీసులు న్యయస్థానానికి చేరుకున్నారు. సునీల్ ను గుర్తించిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు లొంగిపోయే అవకాశం పోలీసులు ఇవ్వలేదని సివల్ డ్రస్ లో ఉన్న పోలీసులు తమను బయటకు గెంటివేశారని సునీల్ తరపున న్యాయవాదులు అంటున్నారు. అయితే సునీల్ న్యాయస్థానానికి వచ్చిన సమయంలో ఛాంబర్ లో జడ్జిలేరు. ఆయన భోజనానికి వెళ్లిన సమయంలో ఈఘటన చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘతటనకు సంబంధించి సునీల్ కుమార్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎట్టకేలకు సునీల్ కుమార్ చిక్కడంతో ఇక ఈ కేసు చిక్కుముడులు విప్పే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *