జయ ఫొటోలు బయటకి రాంది అందుకే…

0
62
Chennai: Tamil Nadu Chief Minister J Jayalalithaa at the foundation stone laying ceremony of the Chennai Metro Rail Project Phase-I Extension from Washermanpet to Thiruvottiyur, in Chennai on Saturday. PTI Photo by R Senthil Kumar(PTI7_23_2016_000119A)

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన చిత్రాలను విడుదల చేయవద్దని దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్వయంగా కోరినందువల్లే ఆమె చికిత్సకు సంబంధించిన ఎటువంటి ఫొటోలు విడుదల చేయలేదని అపోలో ఆస్పత్రి మద్రాస్ హై కోర్టుకు తెలిపింది. జయలలిత మరణంపై సందేహాలు ఉన్నాయంటూ దాఖలైన పిటీషన్ ను విచారిస్తున్న మద్రాస్ హై కోర్టుకు కౌంటర్ దాఖలు చేసిన అపోలో ఆస్పత్రి తన వాదన వినిపిస్తూ తన ఫొటోలు విడుదల చేయరాదని జయలలిత కోరారని ఆమేరకు ఆమె చిత్రాలను విడుదల చేయలేదని అన్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన హెల్త్ బులెటిన్ విడుదల కూడా ఆమె అనుమతి మేరకే విడుదల చేసినట్టు అపోలో ఆస్పత్రి కోర్టుకు వివరించింది. గత సంవత్సరం సెప్టెంబర్ 22న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత అక్కడ 75 రోజుల పాటు చికిత్సను పొందారు. చికిత్స జరుగుతుండగానే ఆమె డిసెంబర్ 5న తుదిశ్వాస విడిచారు.
జయలలిత చికిత్సకు సంబంధించిన వివరాలను హైకోర్టుకు అపోలో ఆస్పత్రి సీల్డ్ కవర్ లో అందచేసింది. రోగి వ్యక్తిగత  సమాచార విడుదలకు సంబంధించి మెడికల్ కౌన్సిల్ నిబంధనలు కూడా పొందుపర్చిన అపోలో ఆస్పత్రి ఆమెకు కేవలం అపోలో ఆస్పత్రి వైద్యులు మాత్రమే చికిత్సను అందించలేదని ప్రభుత్వ వైద్యులు, ఎయిమ్స్ నిపుణులతో పాటుగా విదేశీ వైద్యులు కూడా ఆమెకు వైద్య సేవలను అందచేశారని చెప్పారు. జయలలిత చికిత్సకు సంబంధించిన వివరాలను తమిళనాడు ప్రభుత్వం కూడా కోర్టుకు అందచేసింది. కేసును హైకోర్టు మార్చి 13కు వాయిదా వేసింది.
 

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here