జమ్ము కాశ్మీర్ లో ఉగ్రవాద మూకలు రెచ్చిపోతున్నాయి. సైనిక, పారా మిలటరీ, పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నాయి. మన బలగాలు ఆదమరిచి ఉన్న సమయంలో దొంగ దెబ్బతీస్తూ జవాన్ల ప్రాణాలను బలిగొంటున్నాయి. గత వారం రోజుల్లో కాశ్మీర్ లో నాలుగు భారీ ఉగ్రదాడులు జరిగాయి. దీన్ని బట్టి ఆక్కడి పరిస్థితిని అంచానా వేయవచ్చు. పెట్రోలింగ్ చేస్తున్న బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వెనక నుండి దొంగ దెబ్బతీస్తున్నారు. మన బలగాలతో నేరుగా తలపడకుండా దొంగచాటుగా జవాన్ల ప్రాణాలను హరిస్తున్నరు. ఈ ఉగ్రవాద మూకలకు స్థానికంగా కొందరు యవకులు సహకరిస్తుండడం మన భద్రతా బలగాల సమస్యలను మరింత తీవ్ర చేస్తున్నాయి.
తాజాగా గురువారం రాత్రి సైనిక గస్తీ బృందం పై జరిగిన దాడిలో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికురాలు ఒకరు కూడా ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కాశ్మీర్ పోషియన్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న సైనిక వాహనాలపై ఉగ్రవాద ముఠాలు భారీ ఆయుధాలతో దాడి చేశారు. వాహనంలో ఉన్న సైనికులను లక్ష్యంగా చేసుకుని రాత్రి 2.30 ప్రాంతంలో కాల్పులకు దిగారు. మన జవాన్లు అప్రమత్తం అయ్యే లోపే తీవ్రవాదులు జరిగిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలు కాగా మరో మహిళ మృతి చెందారు. ఒక్కసారిగా కాల్పులు జరిపిన తీవ్రవాదులు చీకట్లో తప్పించుకున్నారు.