అత్తాపూర్ లో అగ్ని ప్రమాదం 6గురు మృతి

0
57

రాజేంద్రనగర్ అత్తాపూర్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం రాజేంద్ర నగర్ అత్తాపూర్ లో ఏవి-1 ఎయిర్ కూలర్ దుకాణం ఉంది. ఈ దుకాణంలో ఓడిశా నుండి వచ్చిన వసల కూలీలు పనిచేస్తున్నారు. వారు దుకాణంలోనే రాత్రి పూట నిద్రపోతుంటారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారు ఝాముల దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు అఖస్మాత్తుగా వ్యాపించడంతో అందులో ఉన్న వారు తప్పించుకునే సమయం కూడా లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. వీరిలో ఇర్ఫాన్, సద్ధాం,సాదూ,అయూబ్ ఖాన్ లను గుర్తించారు. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. మంటల ధాటికి వీరి శరీరాలు పూర్తిగా కాలిపోయి నట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన దుకాణం యజమానిని పోలీసులు అరెస్టు చేశారు.
అత్తాపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అయిన ఘటనా స్థలికి రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని నాయిని చెప్పారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here