మల్లన ఆలయం చుట్టూతా మంటలు

0
50

 
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలోని సుప్రసిద్ద మల్లయ్య కొండపై జరిగిన ఆగ్నిప్రమాదంలో మంటలు మల్లికార్జున స్వామి ఆలయాన్ని చుట్టుముట్టాయి. ఈ భారీ అగ్నిప్రమాదంలో ఆలయం చుట్టుూతా మంటలు వ్యాపించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. భక్తులను అక్కడి నుండి తరలించారు. అటవీ ప్రాంతం కావడంతో మంటలు త్వరగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ కొండపై దాదాపుగా ఐదు వేల హెక్టార్లలో మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను అదుపుచేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వడం లేదు. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వెయ్యి హెక్టార్లలో అటవీ సంపద కాలి బూడిద అయింది. మంటలు దేవాలయానికి వ్యాపించకుండా ఇప్పటివరకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మల్లయ్య కొండపై చెత్తకు నిప్పు పెట్టడం వల్ల ఈ అగ్ని ప్రమాదం సంభించినట్టు ఆధికారులు భావిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినప్పటికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. మల్లికార్జున స్వామి ఆలయానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here