అక్కినేని అఖిల్ పెళ్లి వాయిదా…?

ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున తనయుడు, యువ హీరో అఖిల్ పెళ్లిపై పలు రకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. డిసెంబర్ లో అఖిల్ ఎంగేజ్ మెంట్ ప్రముఖ పారిశ్రామిక వేత్త జీవీకే మనుమరాలితో జరిగింది. ఈ వేసవిలో వీరి పెళ్లి కొద్ది మంది సన్నిహితుల మధ్య ఇటలీలో జరగాల్సి ఉంది. అయితే ఇటలీలో జరగాల్సిన పెళ్లి వాయిదా పడినట్టు సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఇరు కుటుంబాలకు చెందిన వారు ఎవరూ దృవీకరించడం లేదు. అఖిల్ పెళ్లి వాయాదా పడిందనే వార్తలు వస్తున్నాయి.

ఇటలీలో పెళ్ళికి ఇప్పటికే ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కాగా ఈ పెళ్లికి హాజరు కావాల్సిన వారు టెక్కెట్ల బుకింగ్ తో సహా ఇతర ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. అయితే టికెట్లను క్యాన్సిల్ చేసుకోవాలంటూ వారికి సమాచారం అందినట్టు తెలుస్తోంది. పెళ్లి వాయిదాకు కల కారణాలు తెలియడం లేదు. దాదాపు 700 మంది ఇటలీ వెళ్లేందుకు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సినీ వర్గాలకు చెందిన అత్యంత ప్రముఖులు, సన్నిహితులు హాజరు కావాల్సిన ఈ పెళ్లికి బుక్ చేసిన టికెట్లను క్యాన్సిల్ చేసుకోవాల్సిందిగా కబురు రావడంతో వివాదం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.