శ్రీనివాసుడు అందరివాడు:కేసీఆర్

దేవుడు అందరికీ ఒకటేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్న తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీనివాసుడి దర్శనం చాలా బాగా జరిగిందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చక్కటి ఏర్పాటు చేసిందని మెచ్చుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నామని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు కేసీఆర్ తెలిపారు. తెలంగాణతో పాటుగా అంధ్రప్రదేశ్ అభివృద్దిని కూడా తాము కోరుకుంటున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సంబంధాలు బాగున్నాయని రానున్న రోజుల్లో ఈ రెండు రాష్ట్రాల మధ్య సంభాలు మరింత బలోపేతం అవుతాయన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎటువంటి సహాయం కావాలన్నా చేయాడానికి సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ లో టీటీడీ నిర్మించ తలపెట్టిన వేంకటేశ్వర దేవాలయానికి అన్నిరకాలుగా సహాయం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. తిరుమల వేంకటేశ్వరుడు అందరి వాడని కేసీఆర్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *