తిరుమలేశుడిని దర్శించుకున్న కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా  తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కేసీఆర్ కుటంబ సభ్యులు, మంత్రులు, అధికారులు స్వామివారిని దర్శించుకున్నారు. సంప్రదాయం ప్రకారం తొలుత వరాహ నరసింహ స్వామిని దర్శించుకున్న తరువాత కేసీఆర్ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తులతో కేసీఆర్ స్వామివారి దర్శనానికి వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే తిరుమల స్వామి వారికి మొక్కులు సమర్పించుకుంటానని మొక్కుక్కున్న కేసీఆర్ తన మొక్కులు చెల్లించుకోవడం కోసం తిరుమలకు వచ్చారు.  శ్రీవారికి 5కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను సమర్పించారు. వీటిలో 14.2 కిలోల బంగారు సాలిగ్రామహారంతో పాటుగా 4.65 కిలోల బంగారు కంఠె ఉన్నాయి. అభరాణాలను శ్రీవారికి సమర్పించుకున్న తరువాత వేంకటేశ్వర స్వామిని కేసీఆర్ కుటుంబ సభ్యులు మంత్రులు అధికారులతో కలిసి దర్శించుకున్నారు. కేసీఆర్ తో పాటుగా తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి బొజ్జల  గోపాల కృష్ణారెడ్డి ఏపీ ప్రతినిధిగా కేసీఆర్ వెంట ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల పర్యటన సందర్భంగా అక్కడ కోలాహలం నెలకొంది. కేసీఆర్ బలచేసిన ప్రాంతానికి చేరుకున్న తెలంగాణ వాదులు ఆయన్ను కలిసేందుకు పోటీలు పడ్డారు. కేసీఆర్ మాత్రం అందరికి అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లారు. కేసీఆర్ తిరుమల పర్యటనను ఆధ్యాత్మిక పర్యటనగానే చేస్తున్నారు. ఎటువంటి రాజకీయ వ్యవహారలకు తావు ఇవ్వడం లేదు.
కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న కేసీఆర్‌ తిరుమల శ్రీవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో కుటుంబ సభ్యులు, తెలంగాణ మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వకుళామాతను, శ్రీ విమాన వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని హుండీలో కానుకలు సమర్పించారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ స్పీకర్‌ మధుసూదనాచారి, మంతులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌, పద్మారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్‌ ఎంపీ కవిత ఉన్నారు. ఏపీ ప్రతినిధిగా రాష్ట్రమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కేసీఆర్‌ వెంట ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఆభరణాల సమర్పణ
తిరుమల శ్రీవారికి కేసీఆర్‌ దంపతులు రూ.5కోట్లు విలువైన బంగారు అభరణాలను సమర్పించారు. 14.2కిలోల బంగారు సాలిగ్రామహారం, 4.65కిలోల బంగారు కంఠెను ఆయన సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *