రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించాడు. గతంలో తాను చెప్పినట్టు 2019 ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని పవన్ చెప్పాడు. విజయవాడ సమీపంలోని చినకాకాని వద్ద జరిగిన చేనేత సంఘాల నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గౌన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చేనేత కార్మికులుగా పేర్కొనడం తప్పని వారిని చేనేత కళాకారుగా గౌరవించాలని అన్నారు. రానున్న ఎన్నికల్ల ో తాను పోటీ చేస్తానని శాసనసభలో చేనేత వాణిని వినిపిస్తానని చెప్పారు. తాను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని పేద ప్రజల ఆశలను తీర్చడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. తనకు అధికారం ముఖ్యం కాదని ప్రజల సమస్యలు ఎంతవరకు తీర్చగలిగాము అన్నది ముఖ్యమని చెప్పారు. పవర్ లూమ్స్ పేరిట చేనేత కళకారుల పొట్టలు కొడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని పనన్ కళ్యాణ్ అన్నాడు. పీడిత ప్రజల కష్టాలు తీర్చడం తనకు ముఖ్యమని అన్నారు. తనకు కోట్ల సంపాదనపై మక్కువ లేదని అన్నారు. తాను పెద్ద పెద్ద కార్పోరేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ కోట్లు సంపాదించుకోవచ్చని కానీ తాను ఆవిధంగా చేయదల్చుకోలేదని చెప్పారు. పేదల సమస్యల పట్ల అవగాహన ఉందని వాటిని ఎట్లా పరిష్కరించాలనేదే తన ప్రధమ కర్తవ్యమని చెప్పారు.