ఎంసెట్ షెడ్యూల్ విడుదల

0
57
తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల అయింది. మే 12 న ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు.  ఎంసెట్ నిర్వహణకు సంబంధించిన నోటిఫికేశన్ ను ఈనెల 27న విడుదల చేయనున్నారు. దరఖాస్తు ఫారాలను మార్చి 3 నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు స్వీకరించనున్నట్టు ఎంసెట్ కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఫైన్ తో కట్టేందుకు ఆఖరి తేదీ మే 8వ తారీకు.రూ.500 జరిమానాతో దరఖాస్తుకు ఏప్రిల్ 12వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. రూ.1000 ఫైన్ తో అప్లికేషన్ దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 21వ తేదీ వరకు గడువు ఇచ్చారు. రూ.5వేల ఫైన్ తో ఏప్రిల్ 29వ తేదీ వరకు అవకాశం ఉంది. రూ.10వేల ఫైన్ తో మే 8వ తేదీ వరకు కూడా ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
మే12 న పరీక్షలను నిర్వహించనున్నారు.
ఇంజనీరింగ్ ఎగ్జామ్ టైం : ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు
అగ్రికల్చరల్ అండ్ మెడిసిన్ : మధ్యాహ్న 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు
ఎగ్జామ్ ప్రిలిమినరీ కీ విడుదల : మే 13వ తేదీ, 2017
ప్రిలిమినరీ కీపై అభ్యంతరాల స్వీకరణ చివరి తేదీ : మే 18, 2017
ఫలితాల విడుదల : మే 22, 2017
పరీక్ష ఫీజు : ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ కు రూ.250, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కు రూ.500
Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here