సునీతది ఆత్మహత్యా…?

0
39

టెలికాలర్ సునీతది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. మాధాపూర్ లోని భాగ్యనగర్ కో-ఆపరేటివ్ సొసైటీ సమీపంలోని ఎన్ఐఏ భవనం పక్కన కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని కనుగొన్నారు. చనిపోయింది బన్సీలాల్ పేటకు చెందిన సునీతగా పోలీసులు నిర్థారించారు. అమీర్ పేట కాల్ సెంటర్ లో పనిచేస్తున్న సునీత ది హత్యగా పోలీసులు అనుమానించి ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. సునీత కాల్ డేటా ఆధారంగా ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో సునీతది ఆత్మహత్యగా తేలినట్టు పోలీసులు నిర్థారణకు వచ్చినట్టు తెలుస్తోంది. కూకట్ పల్లికి చెందిన ఒక వ్యక్తిని ప్రేమించిన సునీత అతను తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్టు తెలిసింది.
సునీత ఆ వ్యక్తిని ప్రేమించగా అతను మాత్రం సునీత ప్రేమను తిరస్కరించాడు. తాను ప్రేమించడం లేదని ఖరాఖండీగా చెప్పేయడంతో సునీత ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. దీనిపై ప్రాధమికంగా ఒక నిర్ధారణకు వచ్చిన పోలీసులు మరిన్న ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here