నేతన్నకు మహర్థశ:కేసీఆర్

నేతన్నలకు మహర్థశ వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చేనేత, మరమగ్గాల కార్మికుల సమస్యలు, వారికి కల్పించాల్సిన సౌకర్యాలపై తన నివాసంలో కేసీఆర్ సమీక్ష జరిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటుగా పలువురు అధికారులు హాజరైన సమీక్షా సమావేశంలో కేసీార్ మాట్లాడుతూ వరంగల్ లో ఏర్పాటు కానున్న టెక్స్ టైల్ పార్కు ద్వారా నేతన్నలు బతుకులు బాగుపడతాయని అన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. చేనేత కార్మికుల కోసం బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
నేత కార్మికులు ప్రస్తుతం పడుతున్న కష్టాల నుండి బయటపడాలని అన్నారు. రాష్ట్రంలో నేత కార్మికులు ఎవరూ కష్టాలు పడకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఆకలి ఛావులు, ఆత్మహత్యల నుండి చేనేత కార్మికులు బయట పడాలన్నారు. వారికి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల వల్ల చేనేత కార్మికుల బతుకులు బాగుపడతాయన్నారు. నేతన్నలకు కావాల్సిన సౌకర్యాల కోసం కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. దీనికోసం త్రిముఖ వ్యూహం అవలంబిస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. చేేనేత కార్మికుల బతుకుల్లో వెలుగులు నిండే రోజులు వచ్చాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *