ఆయన వ్యాఖ్యల్లో తప్పేంలేదు:సింధూ

పోలీసులు చార్మినార్ లో నిర్వహించిన 5కే రన్ సందర్భంగా పి.వి.సింధూని వాలీబాల్ ప్లేయర్ గా పేర్కొన్న మజ్లీస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను పి.వి.సింధూ సమర్థించారు. ఆయన జాతీయ వాలీబాల్ ప్లేయర్ అయిన తన తండ్రి గురించి ప్రస్తావిస్తూ ఆతను ఆవిధంగా వ్యాఖ్యానించారని సింధూ ట్విట్టర్ లో పేర్కాన్నారు. ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను తప్పుపట్టాల్సింది ఏమీలేదని అది యాధాలాపంగా అన్న మాటలుగా పి.వి. సింధు పేర్కొన్నారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ పి.వి. సింధును వాలీబాల్ ప్లేయర్ గా సంబోధించడంపై మీడియాలో వార్తలతో పాటుగా సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో విస్తృతంగా ప్రచారం కావడంతో సింధూ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *