గుజరాత్ లో జరుగుతున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ల జాతీయ సదస్సులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల జాతీయ సదస్సు స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేశంలోని వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల బలోపేతం కోసం ఈ కమిటీ సూచనలు చేస్తుంది. ఈ కమిటీకి ఘంటా చక్రపాణి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా విధులను నిర్వహిస్తున్న ఘంటా చక్రపాణి ఈ పదవికి ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది.
ఘంటా చక్రపాణి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల జాతీయ సదస్సు స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా ఎన్నికకావడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఘంటా చక్రపాణికి అభినందనలు తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బలోపేతానికి ఈ ఎంపిక దోహదపడుతుందని ఆయన ఆశభావం వ్యక్తం చేశారు.