పళని స్వామికి విజయశాంతి మద్దతు

తమిళ సినీ వర్గాలు మొత్తం పన్నీరు సెల్వానికి మద్దతుగా నిలవగా మాజీ నటీ, రాజకీయ నాయకురాలు విజయశాంతి మాత్రం పళని స్వామికి బాసటగా నిల్చారు. విశ్వస పరీక్షలో నెగ్గిన పళని స్వామికి విజయశాంతి అభినందనలు తెలిపారు. పళని స్వామి గెలవడం ద్వారా ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పిన విజయశాంతి తాను పళని స్వామికి మద్దతు గా నిలుస్తున్నట్టు చెప్పారు. ఇటీవల శశికళను కలిసి తన మద్దత తెలిపిన విజయశాంతి ఆమె వర్గానికి చెందిన పళని స్వామి ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా పళని స్వామి విజయం సాధించారని అన్నారు.
మరో వైపు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంపై విజయశాంతి తీవ్ర స్వరంలో విరుచుకుని పడ్డారు. పన్నీరు సెల్వం దుష్టశక్తులతో కలిసి పార్టీని చీల్చేందుకు ప్రయత్నాలు చేశారని అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదని అన్నారు. పన్నీరు సెల్వాన్ని దుష్టశక్తిగా విజయశాంతి అభివర్ణించారు. ఎన్నిశక్తులు ఏకమైన మంచిపై ఎప్పుడు చెడు విజయం సాధించలేదని విజయశాంతి చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *