ఐపీఎల్ సీజన్ 10 వేలానికి ఒక రోజు ముందు పుణే సూపర్ జెయింట్స్ నుండి సంచల నిర్ణయం వెలువడింది. తమ జట్టుకు ఇక నుండి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టన్సీ చేయడం లేదంటూ పుణే ప్రకటించడం సంచలనం రేపుతోంది. ధోని కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగుతాడని కెప్టన్సీ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్టు పుణే జట్టు ప్రకటించింది. అయితే కెప్టన్సీ నుండి తప్పుకోవాలనేది ధోనీ నిర్ణయమా లేక పుణే జట్టు జాయమాన్యం ఈ నిర్ణయం తీసుకుందా అనే దానిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయ. ధోనీ స్వయంగా కెప్టెన్సీ పగ్గాలు వదిలేశాడని కొన్ని వార్తలు వస్తుండగా కాదు పూణే యాజమాన్యమే అతన్ని కెప్టెన్సీ పదవి నుండి తప్పుకునేట్టు చేసిందనే వార్తలు కూడా వస్తున్నాయి.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ ని వదులుకున్నందున పుణే జట్టుకు కూడా కెప్టెన్ గా వ్యవహరించలేనని ధోనీ చెప్పిన తరువాతే అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పించినట్టు పుణే జెట్టు ప్రతినిది ఒకరు తెలిపినప్పటికీ అసలు విషయం వేరే ఉందని క్రీడా వర్గాలు అంటున్నాయి. గత ఏదాడి పుణే జట్టు ఐపీఎల్ లో సరిగా రాణించలేదు. అట్టడుగు నుండి రెండు స్థానంలో నిల్చింది. చాలా అంచానాలతో బరిలోకి దిగిన పుణే జట్టు సక్రమంగా రాణించలేకపోయింది. కెప్టెన్ గా ధోనీ ప్రదర్శన కూడా నిరాశాజనకంగానే ఉండింది. ఈ నేపధ్యంలో పుణే జట్టు యాజమాన్యమే ధోనీని కెప్టెన్సీ నుండి తొలగించిందనే వార్తలు వస్తున్నాయి. పుణె జట్టు పగ్గాలు స్మిత్ చేపట్టనున్నారు.