పి.వి.సింధూకు మజ్లీస్ ఎమ్మెల్యే ఝలక్

పి.వి.సింధు పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల కాలంలో ఆమె పేరు మార్మోగుతోంది. ఒలింపిక్స్ లో పతకం సాధించిన తరువాత సింధూను గురించి రెండో తరగతి పిల్లోడు కూడా ఠక్కున చెప్పేయగలడు. అట్లాంటిది పాపం మన ఎమ్మెల్యే గారికి పి.వి. సింధూ ఎవరో తెలిసినట్టు లేదు. ఆమె గురించి తెలియదుకున్నా తాను పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొంటున్న ఇతరుల గురించి తెలుసుకోవాల్సిన కనీస మర్యాదను మరచారు మన ఎమ్మెల్యేగారు. ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్స్ లో రజత పతకాన్ని సాధించిన పీ.వీ.సింధును వాలిబాల్ ప్లేయర్ గా సంబోధిస్తూ  నగర ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాదిక  మాధ్యమాల్లో నవ్వులు పూయిస్తున్నాయి. చార్మినార్ వద్ద పోలీసులు నిర్వహించిన 5కె రన్ కార్యక్రమంలో పి.వి.సింధూ పాల్గొంది. ఇదే కార్యక్రమానికి హాజరైన మజ్లీస్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ పి.వి.సింధూను వాలీబాగ్ ప్లేయర్ గా సంబోధించార. ఇది విన్న పి.వి.సింధు వేదికపై కొంత అసహనానికి గురైనట్టు కనిపించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతరులు ఎవరూ ముంతాజ్ ఖాన్ ను సరిచేసే ప్రయత్నం చేయలేదు.
ఒలింపిక్స్ విజేత, మన హైదరాబాద్ క్రీడాకారిణి పీవీ సింధూ వాలీబాల్ ప్లేయరట…ఇదేమిటీ బ్యాడ్మింటన్‌లో ఒలింపిక్స్ రజత పతకాన్ని సాధించిన సింధూ ఎప్పుడు వాలీబాల్ ఆడిందని అనుకుంటున్నారా…ఆగండాగండి…ఇక్కడే తప్పులో కాలేశారు మన హైదరాబాద్ నగర మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్. చార్మినార్ వద్ద జరిగిన 5కె రన్ కార్యక్రమంలో పాల్గొన్న పీవీ సింధూ పేరును ప్రస్థావిస్తూ  ముంతాజ్ ఖాన్ వాలీబాల్ ప్లేయర్ పీవీ సింధూ అంటూ పేర్కొనడంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీవీ సింధూ ముసిముసి నవ్యులు రువ్వారు.ఈ  కార్యక్రమంలో పాల్గొన్న నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డితోపాటు ఇతర నేతలు, ప్రజలు సింధూ వాలీబాల్ ఎప్పుడు ఆడింది చెప్మా అంటూ బుర్ర గోక్కున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ మాట్లాడే ముందు మన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో చెవిలో గుసగుసలాడటం కనిపించింది. మొన్నామధ్య ఏపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బీకాంలో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులు చదివేశానంటూ సెలవిచ్చి అందర్నీ సంభ్రమాశ్యర్యాల్లో ముంచెత్తారు. మళ్లీ మన మజ్లిస్ ఎమ్మెల్యే బ్యాడ్మింటన్ క్రీడాకారిణిని ఏకంగా వాలీబాల్ ప్లేయర్ చేయడం పట్ల ‘ఇదీ మన ప్రజాప్రతినిధుల జనరల్ నాలెడ్జి’ అంటూ జనం ముక్కున వేలేసుకున్నారు. అయితే సింధూ తల్లిదండ్రులు పూసర్ల రమణ, విజయలక్ష్మిలు మాత్రం వాలీబాల్ క్రీడాకారులు కావడం కొసమెరుపు. మన ఎమ్మెల్యే తల్లిదండ్రులు ఆడిన వాలీబాల్ ఆట కూతురు కూడా ఆడి ఉంటుందని అనుకున్నారేమోనని మరికొందరు వ్యాఖ్యానించారు. మొత్తం మీద పీవీ సింధూ వాలీబాల్ ప్లేయరన్న ఎమ్మెల్యే మాటలు అందరినీ నవ్వుల్లో ముంచెత్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *