తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం కాంగ్రెస్ ఏజెంట్ లాగా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ ఆరోపించారు. విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా వ్యహరిస్తున్న కోదండరాం కు ప్రజలే తగిన బుద్దిచెప్తారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఉద్యోగ భర్తీలు ఆయనకు కనిపించడం లేదా అని కర్నే ప్రశ్నించారు. పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీని చేపడుతున్న నేపధ్యంలో నిరుద్యోగ ర్యాలీలు నిర్వహించాల్సిన అవసరమే లేదని అయన అన్నారు. ప్రభుత్వం పనిచేయకుండా విమర్శించాలి కానీ పనిచేస్తున్న ప్రభుత్వం పై విమర్శలు చేయడం చూస్తుంటే రాజకీయ ప్రయోజనాలకే వారు ఈ విధంగా వ్యవహరిస్తున్నరనేది స్పష్టంగా తెలుస్తోందన్నారు. జేఏసీ పేరుతో నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీలో పాల్గొనవద్దని ఆయన యువతకు పిలుపు నిచ్చారు. కోదండరాం చేస్తున్న చేష్టల వల్ల జేఏసీపై ప్రజల్లో విశ్వాసం పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అడించినట్టల్లా కోదండరాం ఆడుతున్నారని కర్నే ప్రభాకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎవరిని అడ్డం పెట్టుకుని ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని ప్రజలు నమ్మెస్థితిలో లేరని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా వారి మాటలు ప్రజలు పట్టించుకోరని అన్నారు.