విశ్వాసపరీక్షలో నెగ్గిన పళని స్వామి

బలపరీక్షలో పళని స్వామి నెగ్గారు. ఈ ఉదయంనుండి జరిగిన అసెంబ్లీ నడిచిన హైడ్రామా తెరపడింది. అసెంబ్లీలో ఘర్షణ వాతావరణం కారణంగా డీఎంకే సభ్యులను అతి కష్టంమీద మార్షల్స్ సభ నుండి బయటకు పంపారు. కాంగ్రెస్, ముస్లీం లీగ్ పార్టీలు సభనుండి వాకౌట్ చేయడంతో పళని స్వామి ప్రవేశ పెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 122 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 11 ఓట్లు మాత్రమే పడ్డాయి.  ఈ ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ఎటువంటి చర్చలేకుండా స్పీకర్ ధన్ పాల్ విశ్వాస తీర్మానంపై ఓటింగ్ కు అనుమతించారు. అయితే రహష్య ఓటింగ్ కోసం మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, డీఎంకే సభ్యులు పట్టుబట్టడంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభలో హింసాత్మక ఘటనలు జరిగాయి. కుర్చీలు విరిగి చొక్కాలు చిరిగాయి. అధికార ప్రతిపక్ష సభ్యులు పరస్పరం బాహాబాహీకి దిగారు. దీనితో సభను రెండు సార్లు వాయిదా వేశారు. ఆ తరువాత సమావేశమైన సభలో పెద్ద ఎత్తున మార్షల్స్ ను మోహరించి ఓట్ల లెక్కింపును పూర్తి చేశారు స్పీకర్. దీన్లో ప్రభుత్వానికి అనుకూలంగా 122 ఓట్లు వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. ముఖ్యమంత్రి పళని స్వామి అనుకున్నది సాధించారు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా బల పరీక్షలో ప్రభత్వం తాను అనుకున్నది సాధించుకుంది. పళనిస్వామి కావాల్సిన మెజార్టీని సాధించుకున్నారు. పన్నీరు సెల్వంను అడ్డుకోవడం ద్వారా శశికళ వర్గం ఇప్పటికి పార్టీలో పై చేయి సాధించినట్టయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *