అనసూయ ఆట…సుమ పాట…

తెలుగు బుల్లితెరలో ప్రముఖ యాంకర్లుగా వెెలుగొందుతున్న సుమ, అనసూయలు ఒకరు పాడితే మరొకరు ఆడారు. ఇది కూడా వెండితెరపైన. ఈనెల 24న విడుదల కానున్న “విన్నర్” సినిమాకోసం సుమ పాడిన పాటకు అనసూయ డ్యాన్స్ చేశారు. ఈ చిత్రంలో సూయ..సూయ అనే పాటను తాను పాడినట్టు సుమ చెప్పారు. పాట చాలా బాగా వచ్చిందని ఇండ్రస్టీలోని ప్రముఖులు ఆ పాటను మెచ్చుకున్నారని సుమ చెప్పారు. అయితే తాను గాయనిగా స్థిరపడే ఉద్దేశాలు లేవని తాను యాంకర్ గానే కొనసాగుతానని స్పష్టం చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఈ పాట ఐటం సాంగ్ గా కనిపించబోతోంది. అనసూయ ఈ పాటకు డ్యాన్స్ చేశారు.
తొలుత విన్నర్ సినిమాలో ప్రత్యేక గీతంలో నటించాలని తనను అడిగితే తాను అంతగా ఆశక్తి చూపలేదని అయితే పాటను చూసిన తరువాత డ్యాన్స్ చేయడానికి ఒప్పుకున్నట్టు అనసూయ చెప్పారు. ఈ సినిమాలో ఈ పాట ట్రెండ్ సృష్టిస్తుందని అనసూన అన్నారు. సాయిధరమ్ తేజ హీరోగా రూపుదిద్దుకుంటున్న విన్నర్ సినిమా అన్ని వర్గాలను ఆకర్షిస్తుందని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి స్పెషల్ సాంగ్ హైలెట్ గా నిలుస్తుందని చిత్రవర్గాలు చెప్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *