బలపరీక్షకు అంతా రెడీ…

తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్షకు సర్వ సిద్ధం అయింది. అన్నా డీఎంకే లో చీలిక నేపధ్యంలో ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయనేదానిపై ఉత్కంఠ నెలకొంది. 134 మంది సభ్యులున్న అన్నాడీఎంకేలో మేజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ముఖ్యమంత్రి పళని స్వామికే ఉన్నట్టు కనిపిస్తున్నా మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మాత్రం తన ఆశలను వదులుకోవడం లేదు. ప్రస్తుతం పన్నీరు వెంట 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వారి సంఖ్యను పెంచుకునేందుకు పన్నీరు సెల్వం తీవ్రం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఖరి నిమిషంలో అన్ని అస్త్రాలను వినియోగించుకుని తనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలను పెంచుకోవాలని పన్నీరు సెల్వం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా ఓటు వేసే విధంగా సీక్రెట్ బ్యాలెట్ విధానాన్ని అవలంభించాలని పన్నీరు సెల్వం కోరుతున్నారు. మరో వైపు 89 మంది శాసనసభ్యుల బలం ఉన్న డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ నేత స్టాలిన్ తెలిపారు. అటు కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని ఇంతవరకు వెల్లడించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *