ప్రచారపు బరిలో ప్రియాంక

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్ అధినేత్రి సోనియా  గాంధీ కుమారై ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహించారు. యూపీలో ప్రియాంక పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారని ముందగా వార్తలు వచ్చినప్పటికీ ప్రియాంక ప్రచార కార్యక్రమాల్లో ఎక్కడా పెద్దగా కనిపించలేదు. దీనిపై బీజేపీ నేతలు సెటైర్లు కూడా వేశారు. శుక్రవారం రాయ్ బరేలీ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రియాంక సోదరుడు రాహుల్ తో కలిసి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. తన తల్లి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీ, సోదరుడు రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ నియోజకవర్గాలు రాయ్ బరేలీ, అమేధీలలో మాత్రమే ప్రియాంక ప్రచారం నిర్వహిస్తారని సమాచారం.
మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సభల్లో రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోడీపై తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికలకు ముందు దిల్ వాలే చిత్రంలో  షారుక్ ఖాన్ లాగా కనిపించిన మోడీ ఎన్నికలు అయ్యాక   షోలే సినిమాలో  గబ్బర్ సింగ్  లాగా మారిపోయాడని అన్నారు. దీనితో సభలో నవ్వులు విరిశాయి. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఒక్కసారిగా దేశంలో చలామణిలో ఉన్న 86 శాతం నగదును రద్దు చేశారని ఈ విధంగా చేయడం వల్ల ఏర్పడే పరిస్థితులను బేరూజు వేసుకోకుండా తీసుకున్న నిర్ణయం వల్ల దేశ ప్రజలు నానా అగచాట్లు పడ్డా మోడీ పట్టించుకోలేదని మండిపడ్డారు.
ప్రధాన మంత్రి మోడీ ఇచ్చిన వాగ్డానాలు ఏవీ నిలబెట్టుకోవడం లేదని ఆరోపించారు. రైతులకు పంట రుణాలను మాఫీ చేస్తానని ప్రకటించిన మోడీ వాటిని రద్దు చేయకుండా రైతులను మోసం చేశారని దుయ్యబట్టారు. మోడీ అబద్దపు మాటలను ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరని రాహుల్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *