పాక్ లో ఉగ్రవాదుల ఏరివేత

పాకిస్థాన్ లో ఉగ్రవాదుల స్థావరాలపై అక్కడి భద్రతా దళాలు విరుచుకుని పడుతున్నాయి. తాము పెంచి పోషించిన ఉగ్రవాద పాము వారినే కాటువేస్తుండడంతో అక్కడి భద్రతా దళాలు దేశంలోని ఉగ్రవాదులను మట్టుపెట్టే పనిని ప్రారంభించాయి. గత వారం రోజులుగా పాకిస్థాన్ బాంబుల పేలుళ్లతో దద్దరిల్లుతోంది. ఐదు చోట్ల బాంబు దాడులు జరిగాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సుఫీ మసీదులో జరిపిన బాంబు పేలుడులో దాదాపు 80 మంది చనిపోగా 200 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాదులపై పాక్ దళాలు విరుచుకుని పడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉగ్రవాదులను మట్టుపెట్టే కార్యక్రమంలో ఇప్పటివరకు 39 మంది ఉగ్రవాదులను పాక్ దళాలు హతమార్చాయి.
గురువారం బాంబు దాడి జరిగిన సింధ్ ప్రావిన్స్ తో పాటుగా దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ పాకిస్థాన్ దళాలు ఉగ్రవాదులను పట్టుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులకు పాకిస్థాన్ దళాలకు జరిగిన పోరులో 39 మంది ఉగ్రవాదులు చనిపోయా మరికొంత మందిని పాక్ బలగాలు పట్టుకున్నారు. దేశంలో ఒక్కసారిగా ఉగ్రవాదులపై పాకిస్థాన్ దళాలు విరుచుకుని పడుతుండడంతో పలు చోట్ల తీవ్ర ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. భారత్ పైకి ఉగ్రమూలను పంపిస్తూ వారికి ఊతం ఇస్తున్న పాకిస్థాన్ కు ఐఎస్ తీవ్రవాదుల నుండి ముప్పు ఎక్కువయింది. నిత్యం బాంబు దాడులతో ఉగ్రవాదులు పాకిస్థాన్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *