ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

4675e673-9852-47e8-9d8a-340d8733c674
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. అటు రాష్ట్రం వెలుపల, విదేశాల్లోనూ కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని పలు చోట్ల రక్తదాన శిభిరాలను ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించుకున్నారు. పలు చోట్ల కేసీఆర్ సంపుర్ణ ఆరోగ్యంతో తెలంగాణను మరింత ముందుకు తీసుకుని రావాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ భవన్ లో జరిగిన కేసీఆర్ జన్మదిన వేడుకలకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో పాటుగా రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహ్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు పాల్గొన్నారు. నిజమాబాద్ ఎంపీ, కేసీఆర్ కుమారై కవిత హాజరై కేక్ కట్ చేశారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కేసీఆర్ చిత్ర పట ప్రదర్శన పలువురుని ఆకట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *