ఉత్తర్ ప్రదేశ్ కు తాను దత్తపుత్రుడి లాంటివాడినని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని హార్దోయ్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తర్ ప్రదేశ్ సర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచకుని పడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించాయని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో మహిళలకు భద్రత కరువైందని అన్నారు. రాష్ట్రంలో అత్యాచారాలు శృతిమించాయని అన్నారు. అత్యాచారాలకు నెలవుగా మారిన రాష్ట్ర భవిష్యత్తు మారాలంటే బీజేపీని గెలిపించాలని ప్రధాని కోరారు. రాష్ట్రంలో అభివృద్ది అట్టడుగు స్థాయిలో ఉందని దీన్నిఅగ్రస్థానంలోకి తీసుకుని వచ్చే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు.
సమాజ్ వాదీ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని పగటి కలలు కంటోందని అన్నారు. కాంగ్రెస్, ఎస్పీల అవకాశవాద పొత్తు కార్యరూపం దాల్చదని మోడీ అన్నారు. బీఎస్పీ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని మోడీ పేర్కొన్నారు.