తన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు గాను బంధువులకు ముందుగానే విమాన టికెట్లు రిజర్వ్ చేసి మరీ ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడడం సంచనం రేపుతోంది. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీహరి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకుంటే బంధువులు అప్పటికప్పుడు రావడానికి ఇబ్బంది అవుతుంది అనుకున్నాడో ఏమో ఏకంగా వారికి ముందుగానే విమాన టికెట్లను బుక్ చేసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఫొటోకు జననంతో పాటుగా మరణం అని రాసిన తేదీ వేసి మరీ దాన్ని వాట్సాప్ డీపీగా పెట్టుకున్న శ్రీహరి తాను ఆత్మ హత్య చేసుకుంటున్న విషయంపై సమాచారం ఇచ్చి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుటుంబ కలహాల కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నడ్డు శ్రీహారి లేఖ రాశాడు. తన మరణం తరువాత వచ్చే అన్ని రకాల ప్రయోజనాలు తన తల్లికే లభించాలని తన లేఖలో పేర్కొన్నాడు. శ్రీహరి ఆత్మహత్య చేసుకున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంత ముందు చూపుతో అన్ని విషయాలను ఆలోచించిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడడం పై పలువురు విశ్మయం వ్యక్తం చేస్తున్నారు.