నేతన్నకు కొత్త "పవర్"

0
48

సిరిసిల్ల పవర్ లూమ్ పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేదిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తమిళనాడులోని పల్లడం లో పర్యటించిన రాష్ట్ర మంత్రి కేటీఆర్ అక్కడ అవలంభించిన విధానాలకు సరిసిల్లల్లోనూ అభివృద్ది చేయాలని కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. చేనేత, జౌళి పరిశ్రమల తీరుతెన్నులు పరిశీలించేందుకు తమిళనాడులో పర్యటించిన కేటీఆర్ అక్కడి కార్మికులు చేనేత నుండి పవర్ లూక్ కు మారిన విధానంపై ఆరాతీశారు. పవర్ లూమ్ ప్రాజెక్టు పార్క్ ఏర్పాటు దానికి కావాల్సిన వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ తదిరత అంశాలను అధ్యాయనం చేశారు. వాటిలో మనకు అనుకూలంగా ఉన్న విధానాలను అమలు చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా తిరుప్పూర్ నుండి పెద్ద ఎత్తున జరుగుతున్న ఎగుమతులను పరిశీలించడంతో పాటుగా అక్కడి వ్యాపారులతో కేటీఆర్ సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం వరంగల్ లో ఏర్పాటు చేస్తున్న చేనేత, జౌళి పరిశ్రమలకు సంబంధించిన వివరాలను వారిని చెప్పారు. తమ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు అండగా ఉంటుందని చెప్తూ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటూ వారిని ఆహ్వానించారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here