ఇంటర్నెట్ లో అశ్లీల వీడియోలను తొలగించాలని కోరుతూ ఒక మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇంటర్నెట్ లో విచ్చలవిడిగా లభ్యం అవుతున్న ఈ సైట్ ల వల్ల కుటుంబ పరంగా తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆమె కోర్టుకు వివరించారు. అశ్లీల సైట్ల ను చూడడం అలవాటు చేసుకున్న తన భర్త వల్ల తాను అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్టు ఆమె కోర్టు వివరించారు. అశ్లీల సైట్లకు అలవాటు పడడం వల్ల తన వైవాహిక జీవితంలో సమస్యలు మొదలైనట్టు ఆమె చెప్పారు. ఇట్లాంటి సైట్లపై పూర్తి నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలని ఆమె సుప్రీం కోర్టును కోరారు.
రెండు సంవత్సరాల క్రితం తన భర్త అశ్లీల సైట్లకు బానిసగా మారాడని పిల్లలు కూడా ఉన్న తన కుటుంబం దీని వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సదరు మహిళ వాపోయారు. బాగా చదువుకుని సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న తన భర్త ఇటువంటి వ్యసనం నుండి బయటకి రాలేకపోతున్నారని అటువంటిది యువత ఇటువంటి సైట్లకు అలవాటు పడుతున్నరన్నారు. తన సమస్యను అర్థం చేసుకుని న్యాయం చేయాలని ఆమె తన పిటీషన్ లో పేర్కొన్నారు. తాను ఒక సామాజిక కార్యకర్తగా చెప్పుకుని సదరు మహిళ తనలాంటి వారు చాలా మంది వీటివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బయటకు చెప్పుకోవడం లేదన్నారు.